

మనన్యూస్,నెల్లూరు:స్థానిక పత్రిక సంపాదకులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.శ్రద్ధాంజలి ఘటించిన జర్నలిస్ట్ యూనియన్ నేతలు.
‘స్ప్రెడ్ న్యూస్’ సంపాదకుడు పామూరు జయ రమేష్ రెడ్డి అనారోగ్య కారణాలవల్ల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న జర్నలిస్టు సంఘాల నేతలు ఆదివారం ఉదయం ఆయన మృతదేహం సందర్శించారు. మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి వ్యక్తి రమేష్ రెడ్డి ఇలా అనారోగ్యం కారణాల వల్ల మరణించడం చాలా బాధాకరమైన విషయమనీ పేర్కొన్నారు. అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ వివాద రహితులుగా పేరుందిన రమేష్ రెడ్డి ఇలా మరణించడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి విన్నవిస్తూ స్థానిక పత్రికల సంపాదకులను మరణించిన సమయంలో వారి కుటుంబాలను ఆదరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాలని ,వారి పిల్లలకు విద్య, వైద్యం అందించే బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఏ. జయప్రకాష్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల(APJU) యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి శేఖర్ బాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు ద్వారం వేణుగోపాల్ రెడ్డి,జిల్లా అధ్యక్షుడు మనపాటి చక్రవర్తి, కలం సైనికుడు సంపాదకుడు గడ్డం హ్యానొక్, గ్రేటర్ టుడే సంపాదకులు జి.ప్రతాపరెడ్డి, స్థానిక పత్రికల సంపాదకులు ప్రదీప్ రెడ్డి, గోపీనాథ్,సరళ, సరస్వతి, అభయం శ్రీనివాసులు ,మనోహర్ రెడ్డి, విశ్వనాథ సాంబయ్య జర్నలిస్టులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.
