

మనన్యూస్,నెల్లూరు:రంగనాయకుల పేట లో శనివారం రంజాన్ తోఫా పంపిణి కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై 300 మంది మహిళలకు రంజాన్ తోఫా చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రంజాన్ తోఫా పంపిణి కార్యక్రమం చేపట్టిన వైసిపి 52 వ డివిజన్ ఇన్ చార్జ్ మహబూబ్ బాషా ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ పెర్నెటి కోటేశ్వర రెడ్డి, డివిజన్ కోఆర్డినేటర్ రమేష్, బి వి కే యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్,పెంచలయ్య అజుము, మూస,నూరూ, జలీల్ వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
