గంగమ్మ గుడి పెండింగ్ ప‌నుల పూర్తికి టిటిడి అద‌న‌పు నిధులుః బోర్డ్ ఛైర్మ‌న్, ఎమ్మెల్యే వెల్ల‌డి

మనన్యూస్,తిరుప‌తి:తాత‌య్యగుంట గంగ‌మ్మ గుడి పునర్నిర్మాణ పెండింగ్ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌ని
టిటిడి బోర్డ్ ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు వెల్ల‌డించారు. ఆల‌య ఆవ‌ర‌ణ‌లో జ‌రుగుతున్న పెండింగ్ ప‌నుల‌ను వారు శ‌నివారం ఉద‌యం ప‌రిశీలించారు. పెండింగ్ ప‌నుల వివ‌రాల‌ను ఈఓ జ‌య‌కుమార్, ఆల‌య‌, టిటిడి ఇంజినీరింగ్ అధికారులు ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులుకు వివ‌రించారు. రెండు నెల‌ల కింద‌ట టిటిడి ఛైర్మ‌న్ ను క‌లిసి గంగ‌మ్మ గుడి ఆలయంలో పెండింగ్ ప‌నుల పూర్తికి మూడు కోట్లా తొంభై ల‌క్షుల నిధులు కేటాయించాల‌ని కోరిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. ఆల‌యంలో పెండింగ్ లో ఉన్న పోటు, ఆల‌య ప్రాకారం ప‌నులు, ముఖ‌మండ‌పం, మ‌రుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కావాల‌ని కోరిన‌ట్లు ఆయ‌న చెప్పారు. దీంతో ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు గంగ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించి ప‌నుల‌ను ప‌రిశీలించ‌డంతో పాటు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నార‌ని ఆయ‌న చెప్పారు. గంగ‌జాత‌ర‌ను తిరుప‌తి వాసులు ఎంతో సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా నిర్వ‌హిస్తార‌ని ఆయ‌న చెబుతూ గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో ఇష్టారీతిన నిర్వ‌హించార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గంగ‌మ్మ ఆల‌య పెండింగ్ ప‌నుల పూర్తికి ప్ర‌తిపాద‌న‌లు అందాయ‌ని వీటిపై ఈ నెల 24వ తేదీ బోర్డు మీటింగ్ లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని బోర్డ్ ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు తెలిపారు. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త‌లో 3.75 కోట్లు ఆల‌య అభివృద్ధికి ఇచ్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు. గంగ‌జాత‌ర‌ను ఎంతో భ‌క్తి భావంతో స్థానికులు జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఆల‌య ప‌నులు వేగవంత‌మైయ్యాయని ఆయ‌న చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్యాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ సంక్షేమ‌, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టిటిడి బోర్డు స‌భ్యులు భానుప్ర‌కాష్ రెడ్డి, డిప్యూటీ మేయ‌ర్ ఆర్సీ మునికృష్ణ‌, కార్పోరేట‌ర్లు ఎస్కే బాబు,నరసింహా ఆచ్చారి, నరేంద్ర, సికే రేవ‌తి, క‌ల్ప‌నా యాద‌వ్, టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి మ‌బ్బు దేవ‌నారాయ‌ణ రెడ్డి, దంపూరి భాస్కర్ యాదవ్, పులిగోరు మురళీ, మహేష్ యాదవ్, భరణి యాదవ్, హేమంత కుమార్ యాదవ్, దొడ్డరెడ్డి రామకృష్ణా రెడ్డి, దొడ్డరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, సుధా, బాబ్జీ, సుభాషిణి,
జిమ్ మురళీ, ఆముదాల వెంకటేష్, ఆకేపాటి సుభాషిణి, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ , పొనగంటి భాస్కర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి