

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం, ఏలేశ్వరం నగర పంచాయితీ మసీదు నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు ముద్రగడ గిరిబాబు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజులపాటు ఎంతో నియమ నిష్ఠలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాసం ఉండి అల్లాహ్ కృపకు పాత్రులవు తారని మరియు క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని ఆయన అన్నారు.ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వారు ప్రతిరోజూ ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని,ఈ నెలలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాను ఆకాశం నుంచి పంపించారని ముస్లింల నమ్మకం అని ఆయన పేర్కొన్నారు.మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపు మాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువు షేక్ దిల్బర్ హుస్సేన్,పట్టణ నాయకులు శిడగం వెంకటేశ్వరరావు,బదిరెడ్డి గోవింద్,జువ్విన వీర్రాజు,సుంకర రాంబాబు,సామంతుల సూర్య కుమార్,సిరిపురపు రాజేష్,డేగల చంద్రమౌళి,శిడగం రాజ రాజేశ్వరరావు,బదిరెడ్డి వెంకన్నబాబు,షేక్ అమీర్, ఖాన్ మాస్టర్, రబ్బానీ, కోకిల ఖాన్,షబ్బీర్,అలీషా తదితరులు పాల్గొన్నారు.