

కలిగిరి సీఐ వెంకటనారాయణ, జలదంకి ఎస్ ఐ సయ్యద్ లతీఫున్నీసాకి దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కమ్మవారిపాలెం లో మహిళలపై జరిగిన దాడి కేసులో నిందితులను కఠినంగా శిక్షించండి..!
ఎంతటి వారైనా, నాకు బంధువులైన, సన్నిహితులైన, అక్క చెల్లెమ్మల జోలికి వస్తే సహించవద్దు..! చట్టపరమైన చర్యలు తీసుకోండి..!
ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్..!
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, దురుసుగా వ్యవహరించినా, దాడి చేసినా. కఠినంగా శిక్షించండి..!
మనన్యూస్,జలదంకి:ఉదయగిరి నియోజకవర్గంలో ని ఆడపడుచులు ,అక్క చెల్లెమ్మల, జోలికి ఎవరైనా వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని, చట్టానికి వారు అతీతులు కారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలిగిరి సీఐ వెంకటనారాయణ మరియు జలదంకి ఎస్ ఐ సయ్యద్ లతీపున్నిషా కి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ దిశా నిర్దేశం చేశారు. జలదంకి మండలం కమ్మవారిపాలెంలో మహిళలపై జరిగిన దాడి విషయం తెలుసుకున్న ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఉన్నప్పటికీ ఆడపడుచులపై జరిగిన దాడిని తెలుసుకొని వెంటనే స్పందించి కలిగిరి సీఐ వెంకటనారాయణ తో మరియు జలదంకి ఎస్ ఐ సయ్యద్ లతీ పున్నిషా తో నేరుగా ఫోన్లో మాట్లాడుతూ నిందితులను ఉపేక్షించవద్దని, కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం అని ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి హాని తలపెడితే సహించనన్నారు.
