మన న్యూస్,జుక్కల్,ఈ పిల్లలంతా ఆడుకుంటుంది ఎక్కడో మున్సిపాలిటీ పార్కులో కాదు..స్వయానా పోలీస్ స్టేషన్ ఆవరణలో, ఇదేంటి పోలీస్ స్టేషన్ ఆవరణలో పిల్లల పార్కు ఉందని అంటున్నారు అని మీరు కొద్దిగా ఆలోచిస్తారు కదా.. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి, మరి కొద్ది రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. తమ పిల్లలకు ఇంట్లో నుంచి వెళ్లొద్దు అంటే కూడా కాదు .అంటూ బయటకు వెళ్లి వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.వీటిని అన్నిటిని ఆలోచించారు మన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. ఇంకేముంది పోలీస్ స్టేషన్లో ఆవరణలో ఉన్న చెత్తాచెదారం అంతా తొలగించి శుభ్రపరిచారు. చిన్నారులు ఆడుకోవడానికి కావలసిన ఆట సామాగ్రి ఏర్పాటు చేశారు. ఇంకేముంది పాఠశాల వదలడం ఇంట్లో పుస్తకాలు పడేయడం, హాయిగా పిల్లలందరూ కలిసి వచ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీడా సామాగ్రితో ఆటలాడుతూ ఆనందోత్సవాల్లో మునిగిపోతున్నారు. ఇది ఎక్కడ కాదు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆవరణలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశం మేరకు స్థానిక సీఐ జగడం నరేష్, ఎస్సై మోహన్ రెడ్డి కలిసి అందమైన చిన్నారుల పార్క్ ఏర్పాటు చేశారు. అది పోలీస్ స్టేషన్ అని చెప్తే ఎవరూ నమ్మరు. అది ఒక చిన్నారుల పార్కుగా కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పిల్లలు ఈ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన పిల్లల పార్కులో సందడే ..సందడి. వీరికి కావలసిన మంచినీటి అంతేకాకుండా చిన్నారులకు బిస్కెట్లు అందజేస్తున్నారు స్థానిక సిఐఎస్ఐలు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ ముందు ఉన్న మురికి కాలువలు శుభ్రపరచారు. ఇంతకుముందు బిచ్కుంద పోలీస్ స్టేషన్ క వెళ్లాలంటే మురికి కంపు వచ్చేది. అలాంటిది ఒకేసారి పోలీసులు తలుచుకుంటే లాటి దెబ్బలకు తక్కువ అనుకుంటే సాధ్యం కానీ పని లేదు అని నిరూపించుకున్నారు బిచ్కుంద పోలీస్ శాఖ. ఆచరణలో పెట్టారు ప్రస్తుతం బిచ్కుంద పోలీస్ స్టేషన్ పిల్లల పార్కుగా మారిపోయింది. ఇంకేముంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ వదలకుండా పిల్లల పార్కులు ఆటలాడుతూ ఆనందంగా గడుపుతున్నారు బిచ్కుంద పట్టణ వాసుల చిన్నారులు. ఆలోచిస్తే ఏదైనా చేయవచ్చు అని నిరూపించారు బిచ్కుంద పోలీస్ శాఖ. ఎప్పుడు పోలీస్ కేసులతో సందడిగా ఉండే బిచ్కుంద పోలీస్ స్టేషన్ సీఐ జగడం నరేష్, ఎస్సై మోహన్ రెడ్డి కృషి ఫలితంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేశారంటే ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే వేసవి కాలంలో చిన్నారులు ఎండలో తిరగడం, ప్రమాదాల గురికావడం వల్ల కొన్ని కుటుంబాలు బాధపడుతుంటాయి. అలా కాకుండా చిన్నారులందరూ ఒక దగ్గర వచ్చి చల్లటి నీడలో ఆడుకుంటూ, పాడుకుంటూ బిచ్కుంద చిల్డ్రన్ పార్క్ లో సందడి గా మారిపోయింది.. శభాష్ సిఐ జగడం నరేష్ గారు, ఎస్సై మోహన్ రెడ్డి గారు మీ ఆలోచన అదిరింది.పిల్లలు వడదెబ్బ బారిన పడకుండా.సిఐ జగడం నరేష్ ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి.. పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. మరి కొన్ని రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. సెలవులు వచ్చిందంటే పిల్లలు ఇంట్లో ఉంటే చెప్పు, ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఎండలో తిరుగుతూ వడదెబ్బ బారిన పడుతున్నారు. దీనిని దిష్టి పెట్టుకొని పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశం మేరకు చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందని బిచ్కుంద సీఐ జగన్ నరేష్ మన న్యూస్ వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చిన్నారులు వచ్చి ఈ చిల్డ్రన్ పార్కులో ఆడుతూ పాడుతూ కాలం గడుపుతున్నారు. చిల్డ్రన్ పార్కులో పిల్లల సందడి మొదలైంది. ఇది పోలీస్ స్టేషన్ కాదు ఇది ఒక చిల్డ్రన్ గార్డెన్ అంటూ సిఐ జగడం నరేష్ వ్యాఖ్యానించారు. చిన్నారులు అందరూ వచ్చి చల్లటి నీడలో ఏర్పాటుచేసిన చిల్డ్రన్ పార్కులో వచ్చి ఆడుకోవాలంటూ సిఐ జగడం నరేష్ కోరారు.