నర్వ మండలం, మన న్యూస్ :-గీతా భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాత్కాలికంగా పాఠశాల పరిపాలనా బాధ్యతలను చేపట్టి, నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు.పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..విద్యార్థులకు సమాజంలోని బాధ్యతలను అర్థం చేసుకునే మంచి అవకాశం ఇది అని అన్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు డి.ఇ. ఓ, ఎం.ఇ. ఓ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, మరియు ఇతర సిబ్బంది పాత్రలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే విధానాన్ని అభ్యసించారు. అనంతరం అగ్రశ్రేణి విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ దినోత్సవం విద్యార్థులలో నాయకత్వ గుణాలను పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తులో సమాజానికి సేవ చేయాలనే నిబద్ధతను కలిగించింది.