గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 20 :- జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజీ సమీపంలో నందు కర్నూలు జిల్లా వైపు నుంచి హైదరాబాద్ వైపు పోతున్న TS32 T5929నెంబర్ గాల బులోరో వాహనం లోని బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన కోళ్ళను వేముల స్టేజీ సమీపంలో రోడ్లపై పడేస్తుండగా అటుగా గద్వాల్ కు వెళ్తున్న రిపోర్టర్ చూసి బులోర వాహనం డ్రైవర్ ని బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను ఎందుకు రోడ్లపై పడేస్తున్నావు అని అడిగితె వాహనం డ్రైవర్ నీకే ఎందుకు నీకేమీ సంబంధం అని అర్థం పర్ధం లేకుండా సమాదానం ఇవ్వడం జరిగింది. నీవు రిపోర్టర్ అయితే నా వాహనాన్ని ఫోటోలు తీస్తావా నీపై కేసు పెండుతాను, నీ అంతు చూస్తాను అని బెదిరుస్తున్నాడు నువ్వు రిపోర్టర్ ఐతే నాకేంటి అని కొట్టడానికి వస్తున్నాడు. అంతేకాకుండా తల తోక లేని సమాధానం చెప్పుతూ నేను చనిపోయిన కోళ్ళను లెక్కచేస్తున్న అని చెప్పడం జరిగింది చనిపోయిన కోళ్ళను కోళ్ల ఫారం దగ్గర నుండి లెక్క వేసుకోలేదు అవి లెక్క వేసుకొండి అని మా ఓనర్ చెప్పాడు అందుకే చనిపోనవి ఎన్ని ఉన్నాయో లెక్క వేస్తున్న అని డ్రైవర్ చెపుతున్నాడు.