గొల్లప్రోలు మార్చి 20 మన న్యూస్ ; ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికీ గోదావరి ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.గురువారం ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఆఫీస్ లో సూపర్ డెంట్ ఇంజనీరింగ్ గోపినాథ్ తో మురాలశెట్టి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ డెల్టా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని గోపినాథ్ కు వివరించారు.రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఎద్దడిని నివారించి, అవసరమైన సాగునీరు అందించాలని కోరారు.రైతుల కు సాగునీరు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎస్ ఇ గోపినాథ్ మురాలశెట్టి కి తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు డిస్ట్రిబ్యూషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.