వి వి ప్యాట్ స్లిప్ లు లెక్కించే విధానం అమలు చేయాలి
టెలికం అడ్వైజర్ కమిటీ సభ్యులు మేకల కృష్ణ
మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:భారతదేశంలో గల కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు గుర్తింపుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని కొని సంవత్సరాలుగా అనేక మంది మేదావులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్న విజ్ఞప్తిలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల కమీషన్ ఓటర్ ఐడికి ఆధార్ కార్డు అనుసంధానం నిర్వహణ చేపట్టేందుకు అంగీకరించడం వెంటనే అమలు జరపడానికి పలు ప్రయత్నాలు చేయడం పట్ల జల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహాసభ్యులు,జనసేన నాయకులు మేకల కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా మేకల కృష్ణ మాట్లాడుతూ, ఓటరుకార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేయడం వలన ఓటరుజాబితాలో దేశ,రాష్ట్రాల,జిల్లాల,మండలాల,గ్రామస్దాయిల వరకు గల ఓటరు లిస్టులలో ప్రతి ఓటు హక్కు కల్గినవారికి ఒకే ఓటు ఒక్కచోట మాత్రమే ఓటుహక్కు నమోదు చేసి ఒక ఓటరుగా జరిగే ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే ఓటుహక్కు వినియోగం చేసుకొనే అవకాశం ఏర్పడుతుందన్నారు. దీనికారణంగా ఒకే వ్యక్తి డబుల్ ఎంట్రీ ఓట్లు వినియోగం,దొంగ ఓట్లులను నమోదుకు అవకాశం ఉండదన్నారు. భవిష్యత్తు ఎన్నికలలో పోలింగ్ లో వేలిముద్రల గుర్తింపు వల్లన దొంగఓట్లు వేసే అవకాశం తొలగుతుందన్నారు. గతంలో ఇలాంటి వ్యవస్థ లేని కారణం 10 సంవత్సరాల క్రితం మరణించిన వారి ఓటును జరుగుతున్నా ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకొన్నట్టుగా అనే సంఘటనలు జరిగేవి ఇప్పుడు ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగవుని,ఈ ప్రక్రియలో కూడా ఆధార్ కార్డు నందు గల వేలిముద్రల, ఓటరుకార్డుతో అనుసంధానంలో కొన్ని చికాకులు వస్తాయని అయినకాని రాబోయే కొన్ని సంవత్సరాలలో ఈవిధమైన సమస్యలను అధికమించి సక్రమంగా అమలు జరపడానికి అవకాశం ఏర్పడుతుందని ఆశభావం మేకల కృష్ణ వ్యక్తం చేశారు. భారతదేశ పార్లమెంటులో ప్రత్యేకమైన బిల్లును పెట్టి స్థానికసంస్థల్లో కూడా ఈవీఎం పరికరాలతో ఎన్నికల నిర్వహించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు చేసే బిల్లును ఆమెదించాలని, భారతదేశ చట్టసభలైన రాష్ట్రల శాసనసభలలో,కేంద్రపార్లమెంటులో ధనికులకు ప్రాతినిధ్యం ఎక్కువ అవుతున్న తరుణంలో కేంద్రప్రభుత్వం తగిన విధానపరమైన ఎన్నికల సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం నేటికే ఉందని మేకల కృష్ణ సూచించారు.