మన న్యూస్: పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గం ప్రతినిధి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని,ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు.మంగళవారం మండలంలోని మల్లారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకు మద్దతు ధరను ప్రకటిస్తూ క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు.
గిట్టుబాటు ధర వచ్చేలా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలన్నారు.ఏ గ్రేడ్ తేమశాతం వచ్చేలా చూసుకొవాలని సూచించారు. రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యం రూ. 2320, సాధారణ ధాన్యం రూ.2300 రేటును నిర్ణయించిందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, జిల్లా ఎడిషన్ వ్యవసాయ అధికారి తాతారావు, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీవో వెంకటేశ్వర్లు, ఐకేపీ ఏపీవో జ్యోతి, సొసైటీ అధికారులు, ఐకేపీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.