ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి. ఈనపల్లి పవన్ సాయి
మనన్యూస్,పినపాక నియోజకవర్గం:తెలంగాణ రాష్ట్రంలో విద్యార్ధీ, ప్రజా పోరాటాలకు ఉస్మానియా కేంద్రంగా విశ్వవిద్యాలయంలో విద్యార్ధి హక్కులు కోసం కాకుండా క్యాంపస్ వెలుపల జరిగే పోరాటాలకు వెన్నుదన్నుగా ఉస్మానియా నిలుస్తోందినీ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి తెలిపారు. వందేమాతరం ఉద్యమం మొదలు తెలంగాణ ఉద్యమం వరకు పోరాటాలకు కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయంనీ, ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగ్యారంటీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ మా ఏడవ గ్యారంటీ అని ప్రకటించి నియంతృత్వ పోకడలు ఇక్కడ చెల్లదంటూ నాడు ప్రగతి భవన్ కంచెలు తీసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు క్యాంపస్ లో నినాదాలు, పోరాటాలు, ధర్నాలు ఉండకూడదు అని అప్రజాస్వామిక, నియంతృత్వ సర్క్యూలర్ రిజిస్టర్ నరేష్ రెడ్డి చేత జారీ చేయించారునీ విమర్శించారు.
ఈ సర్క్యూలర్ అప్రజాస్వామ్యం, అనైతికం, తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని (ఏఐఎస్ఎఫ్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి గా డిమాండ్ చేశారు. విద్యార్థులు సమస్యలు అనేకం ఉన్నాయి. మెస్ బకాయిలు, స్కాలర్ షిప్స్, హస్టల్స్ రీపేర్లు, పెండింగ్ ఫెలోషిప్స్, రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగా అభివృద్ధి కోసం నిధులు, నూతన భవనాలు ,రెగ్యూలర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పేరుతో వేలాది రూపాయలు ఫీజులు పెంపు ఈ అంశాలపై విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్నారు. వీటి గురించి మాట్లాడకుండా విద్యార్థులు గొంతు నోక్కె ప్రయత్నం చేయడం దుర్మార్గం అని అన్నారు. ప్రజాపాలన పేరుతో నియంతృత్వం అమలు చేయడాన్ని వెనక్కి తీసుకుని, తక్షణమే ఈ సర్క్యూలర్ వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కార్యదర్శి అక్కెనపల్లి నాగేంద్రబాబు, మండల నాయకులు సుజన్, వంశీ, నాయకులు కమల్ రాజ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.