మనన్యూస్,ఎల్బీనగర్:టి కె ఆర్ కమాన్ దగ్గర లో గాడిపల్లి చంద్రమౌళి,ఏళ్ల రామ్ రెడ్డి సంయుక్త నేతృత్వంలో బుచ్చిబాబు ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ మొదటి బ్రాంచ్ అని,తమ రెస్టారెంట్ నందు వెజ్ నాన్ వెజ్ బిర్యానీలు,మీల్స్, స్టాటర్స్ లభిస్తాయన్నారు. కుటుంబ సమేతంగా అహలదకరమైన వాతావరణంలో భోజనం చేసే సదుపాయం తమ రెస్టారెంట్లో కలదన్నారు. అంతేకాకుండా టీ స్నాక్స్ కూడా లభిస్తాయి అన్నారు. స్విగ్గి,జొమాటో వంటి ఆన్లైన్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో గాడిపల్లి పరమేశ్వర బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాజమాన్యాన్ని అభినందించారు.