పిఠాపురం మార్చి 18 మన న్యూస్ ;-డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాఅన్నదానం కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషం అని కౌడా చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి బాబు అన్నారు.బుధవారం పిఠాపురం పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలకు నిత్య అన్నదానం కార్యక్రమాన్నీ గ్రాడ్యుట్ ఎమ్మెల్సీ పెరబత్తుల రాజశేఖర్ గారితో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలని ఎంతో మందికి అన్నం పెట్టిన ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్పూర్తితో ఇలాంటి కార్యక్రమాన్నీ పిఠాపురంలో మొదలుపెట్టి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన చేయూత సంస్థ మొండి రవికుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్ డెంట్ పి.సుజాత,ఆసుపత్రి కమిటీ మెంబర్ బొజ్జ రవికుమార్,చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.