11.5కేజీల వెండి.. 32.8 గ్రాముల బంగారం స్వాధీనం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:పట్టణంలోని స్ధానికబాలాజీ చౌక్ దగ్గరలో సిద్దనాద్ జ్యువెలర్స్ లో
గత నెల 9వ తేదీన జ్యువెలరీ నందు జరిగిన చోరీని ప్రత్తిపాడు పోలీసులు చేధించారు.ఈ సందర్భంగా నిందితులను చోరీ సొత్తును మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ మాట్లాడుతూ ఏలేశ్వరం ప్రధాన రహదారిలో సిద్దనాథ్ జ్యువెలరీ షాపులో ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి జరిగిన చోరీ ఘటనపై పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు ఆద్వర్యంలో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ఎస్ అప్పారావు తమ సిబ్బందితో కేసును ఛేదించారని తెలిపారు.
ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన కరణం కుమార్ A1 ముద్దాయిగా,కడప జిల్లా చెందిన గుమ్మల వెంకటసుబ్బయ్యను A2గా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.వారి వద్ద నుండి ఒక పల్సర్ బైక్,11 కేజీలన్నర వెండి, 32.8 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు.A 1ముద్దాయి పై 30 దొంగతనం కేసులు ఉన్నాయని,A2 ముద్దాయిపై 11 ఎర్రచందనం కేసులతో పాటు 10 దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు.నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.సిద్ధనాద్ జ్యువెలరీ దొంగతనం కేసును చేధించిన సీఐ బి ఎస్ అప్పారావు,ఏలేశ్వరం ప్రత్తిపాడు,అన్నవరం రౌతులపూడి ఎస్సైలు ఎన్. రామలింగేశ్వరరావు,ఎస్ లక్ష్మికకాంతం,శ్రీహరి బాబు,జి. వెంకటేశ్వరరావులని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.