శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం
మనన్యూస్,తిరుపతి:ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా(ఎలక్ట్)బాధ్యతలు చేపట్టనున్న డాక్టర్ రవి రాజును, తిరుపతి శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరెడ్డి, ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు, కోఆర్డినేటర్ గంటా చంద్రమోహన్, సభ్యులు రామచంద్ర రాజు, 302 డిస్టిక్ కార్యదర్శి మునికృష్ణ, తణుకు వాకర్స్ అధ్యక్షులు రామచంద్రరాజు, పాస్ట్ వైస్ ప్రెసిడెంట్ లు సుధాకర్ రెడ్డి, కోనేటి రవిరాజులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పుత్తూరు వాకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రవిరాజును మర్యాదపూర్వకంగా కలసి సత్కరించారు. త్వరలో తిరుపతి పుత్తూరులో జరిగే ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ సదస్సులకు తమ వంతు సంపూర్ణ సహకారం అందించనున్నట్లు శ్రీ వినాయక సాగర్ వాకర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. డాక్టర్ రవి రాజు మాట్లాడుతూ వాకర్స్ సభ్యులు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అన్నారు. తనను సత్కరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాల సమయంలో సభ్యుల ఐక్యతకు, వాకర్స్ Such నిర్మాణాలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. వాకర్స్ సభ్యుల సంక్షేమ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుంటామన్నారు.