అర్హత కలిగిన ప్రతి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి
రేషన్ కార్డు ప్రామాణికాన్ని తొలగించాలి
సామాజిక కార్యకర్త కర్నె రవి
మనన్యూస్,పినపాక నియోజకవర్గం:మణుగూరు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పధకాన్ని
నియోజకవర్గంలో అధికారులు పారదర్శకంగా అమలు చేయాలని,సామాజిక కార్యకర్త కర్నె రవి
కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం ద్వారా అర్హత కలిగిన ప్రతి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలన్నారు.నైపుణ్యం ఉండీ ఉద్యోగం లభించని యువతకు ఈ పథకం కింద ప్రాధాన్యత కల్పించాలని,అర్హులు, నిజమైన నిరుద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే విధంగా లబ్ది దారులను ఎంపిక చేపట్టలన్నారు. మరో వైపు ఈ పధకానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే వృత్తి నైపుణ్యం, స్టడీ సర్టీపికెట్లుతోపాటు రేషన్ కార్డు ప్రామాణికంగా
పెట్టారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఏ ఒక్కరికి నూతన రేషన్ కార్డు మంజూరు చేయలేదని, నేటి ప్రజాప్రభుత్వ పాలన పదిహేను నెలలు
గడుస్తున్నా కనీసం గ్రామాలలో ఒక్క కుటుంబాని కి ఆహార భద్రతకార్డులు జారీ కాలేదన్నారు. పాలకుల మాటలు హమీలకే పరిమితం అయ్యాయని ఆరోపిం చారు. దీనితో పథకానికి ధరఖాస్తు చేసుకొనే యువత రేషన్ కార్డు లులేకపోవడంతో పెద్ద ఎత్తున నష్ట పోయే ప్రమాదం ఉందన్నారు.నిరుద్యోగ యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని దరఖాస్తు స్వీకరణలో రేషన్ కార్డు ప్రామాణికకాలాన్ని తొలగించి, మారేదైన గుర్తింపు ను జోడించాలాని ఆయన ప్రభుత్వం కు విజ్ఞప్తిచేశారు.