కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పొదెం వీరయ్య ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులఘనన నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం చేసుకున్న సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్..
అనంతరం వారు మాట్లాడుతూ, బీసీల బిల్లు రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ఆదర్శం అంటూ, తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విప్లమాత్మక ఆడుగన్నారు..తెలంగాణలో ఓబీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.కులఘనన ద్వారానే బీసీలు అనగారిన వర్గాలు తమ హక్కులు పొందగలరని తెలంగాణ బిసి ప్రజలకు ఇంతటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ఉప సంఘం చైర్మన్ ఉత్తంకుమార్ రెడ్డి కి, అదేవిధంగా క్యాబినెట్ మంత్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు..