
మన న్యూస్ (పలాస - కాశీబుగ్గ) ; పలాస గ్రామానికి చెందిన కీర్తిశేషులు దున్న పాపారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వివేకానంద సేవ సంఘం తరఫున శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం పరిసర ప్రాంతాలు రైల్వే గేట్ దగ్గర సుమారు 50 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం జరిగినది. మరియు కోసంగిపురం గ్రామములో ఉన్న శ్రీ లలితా చారిటబుల్ ట్రస్ట్ నందు వారి కుమారులైన దున్న గురుమూర్తి మాస్టారు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిరుపేదలకు అనాధలకు వృద్ధులకు మధ్యాహ్నం అన్నదాన వితరణ వారి కుటుంబ సభ్యులైన దున్న గురుమూర్తి మాస్టారు వారి కుటుంబ సభ్యులసహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు తిన్ని కృష్ణ మాట్లాడుతూ ... గురుమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ వివేకానంద సేవా సమితి సభ్యులు నాగజ్యోతి పాల్గోన్నారు.