మనన్యూస్,తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమితులైన పటాన్ ఫరీద్ తన అనుచరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి సాలువ కప్పి, భారీ గజమాల వేసి పుష్పగుచ్చంతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.అనంతరం పటాన్ ఫరీద్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్ష పదవిని ఇచ్చిన బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మైనార్టీల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,షేక్ సిరాజ్ భాష, మహమ్మద్ భాష (గోరా),చాంద్ భాషా,ఫజల్, ఆరిఫ్,అస్లాం,బావాజీ,జమాల్ బాషా,షర్మిల ఠాగూర్,మహబూబ్ బాషా,కాలేషా,మీర్జాన్,ఆల్తాఫ్, బాబు,షాకీర్,జాఫర్ తదితరులు పాల్గొన్నారు.