Mana News, తిరుపతి జిల్లా సత్యవేడు :- స్థానిక ఎన్జీవో కార్యాలయం లో సోమవారం నాడు బిజెపి పార్టీ కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా బిజెపి పార్టీ ఆర్వో విశ్వనాధ్ జిల్లా జనరల్ సెక్రెటరీ వరప్రసాదులు ఇచ్చేశారు వీధి ఆధ్వర్యంలో నూతన సత్యవేడు మండల అధ్యక్షునిగా పాలగుంట బాలాజీని అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు బాలాజీ మీడియాతో మాట్లాడుతూ మండలంలో బిజెపి పార్టీ బలోవిధానికి కృషి చేస్తానని సీనియర్లు అందరూ కలుపుకుపోతున్నట్టు ఆయన అన్నారు.అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షుడు సామాజి శ్రీనివాసులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఆర్ఓ విశ్వనాధ్ జనరల్ సెక్రెటరీ వరప్రసాద్‌కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని బాలాజీ అన్నారు.బిజెపి పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు వచ్చినా నా దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని నూతన మండల అధ్యక్షుడు బాలాజీ మీడియాతో అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ముని కృష్ణయ్య బిజెపి సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ బండారు మోహన్ బాబు, ఓ బి సి మోర్చా జిల్లా నాయకులు నెల్లూరు వెంకటేశ్వర్లు శెట్టి, బిజెపి సీనియర్ నాయకులు సత్యవేడు అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్ , బిజెపి నాయకులు శేఖర్ శివకుమార్ పవన్ బాబు మహిళలు తదితరులు పాల్గొన్నారు.