Mana News :- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై మహారాష్ట్రలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆ సమాధిని తొలగించాలని కొన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భద్రతను పెంచారు. సమాధిని విజిట్ చేసేవారు కచ్చితంగా తమ ఐడీ కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఛత్రపతి సంబాజీనగర్ జిల్లాలోని ఖుల్దాబాద్లో ఔరంగజేబు సమాధి ఉన్నది. ఖుల్దాబాద్లో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతూ ఇవాళ విశ్వ హిందూ పరిషత్ నేతలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి మెమోరండం కూడా సమర్పించారు.