కరీంనగర్. మన న్యూస్ :- కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ ఆధ్వర్యములో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124 వ జయంతి కరీంనగర్ పట్టణములోని టెలిఫోన్ ఆఫీస్ చౌరస్తా లోని శ్రీ పొట్టి శ్రీరాములు ఐలాండ్ లో ఘనముగా నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని మహనీయునికి పూల మాలతో నివాళులు అర్పించి మహనీయుని గుర్తు చేస్తూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు గొప్ప దేశభక్తుడు, గాందేయవాది, స్వాతంత్ర సమరయోధుడు అని, మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడిచి తెలుగు రాష్ట్ర సాధన కోసం ఏకముగా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరికి ప్రాణాత్యాగం చేసిన గొప్ప మహనీయులని తెలిపారు..
అయన అడుగు జాడల్లో మన అందరం నడవాలని కోరారు, పేరు మార్చడం ఆపేయాలని వినతి పత్రం
తెలుగు యూనివర్సిటీకి శ్రీ పొట్టి శ్రీ రాములు గారి పేరు మార్చడం పై చేసిన తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకునేలా మీ వంతు కృషి చేయాలని కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం మరియు అన్ని ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యం లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది..
ఒకవేళ ప్రభుత్వం స్పందించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తముగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ తెలిపారు..
ఆంధ్ర వాళ్ళ పేర్లు మార్చే దైర్యం ఉందా అని జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కన్న కృష్ణ అన్నారు,
అనంతరం పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమములో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని స్వయముగా భోజనం వడ్డించారు, ఈ కార్యక్రమం లో మాజీ మేయర్ సునీల్ రావు,జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కన్న కృష్ణ, మాజీ అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్, ఏ వి మల్లికార్జున్, పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ అధ్యక్షుడు ఉప్పల రామేశం, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది వేణు, సుద్దాల వెంకటేష్, కొంజర్ల శ్రీకాంత్, జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి కొమురవెల్లి వెంకటేశం, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు జీడిగే సాయి కృష్ణ, పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు తణుకు సాయి కృష్ణ,
జిల్లా మహిళా అధ్యక్షురాలు చకిలం స్వప్న, పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు రావికాంటి భాగ్యలక్ష్మి, గుండా చంద్రమౌళి, తోడుపునూరి రాకేష్, కొండూరి సత్యనారాయణ,దొంతుల మనోహర్, సుర శ్రీనివాస్, పైడా శ్రీనివాస్, నలుమాచు విజయ్, పెద్ది శ్రీనివాస్, రాచామల్ల భద్రయ్య, గర్రెపల్లి శ్రీకాంత్, కేశెట్టి మహేష్, కాచం మహేష్, తోడుపునూరి హరి, అలెంకి సంతోష్,మెహెర్, అమరేందర్, కన్న సాయి, సూరజ్, రాహుల్, రామిడి శ్రీధర్, రేగురి మారుతి, పుల్లూరి అశోక్, కైలాస నవీన్, పబ్బ జ్యోతి, విశ్వనాధం పాల్గొన్నారు..