మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఆటోలో నిర్మానుశ్య ప్రదేశం కు తీసుకెళ్లి బంగారం,వెండి వస్తువులను దోచుకున్న ఘటన శనివారం సాయంత్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ కథనం ప్రకారం.. కల్హేర్ మండలంలోని మర్ది గ్రామానికి చెందిన మ్యాతరి భూమవ్వ తన కూతురు ఇంట్లో పూజ ఉన్నదని అచ్చంపేట్ గ్రామానికి వస్తుండగా నిజాంసాగర్ బస్టాండ్ వద్ద అచ్చంపేట్ వెళ్లడానికి ఆటో కోసం ఎదురుచూస్తుండగా ఒక ఆటో డ్రైవర్ మరియు మహిళ ఇద్దరు కలిసి భూమవ్వను అచ్చంపేట్ కు తీసుకెళ్తా అని చెప్పి ఆటోలో ఎక్కించుకొని ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె దగ్గర ఉన్న రెండు తులాల బంగారు నగలు,20 తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారని ఆయన తెలిపారు.భూమవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ ఐ తెలిపారు.