మనన్యూస్,నెల్లూరు:అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి.అమరజీవి జయంతి కార్యక్రమానికి హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, పలువురు ఆర్యవైశ్య సోదరులు.అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పిస్తున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే నినాదంతో, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు.అమరజీవి త్యాగానికి ప్రతిఫలంగా తెలుగువారి కోసం ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరిట నెల్లూరు జిల్లాకు నామకరణం చేయాలని, దశాబ్దాలుగా పలువురు అనేక విజ్ఞప్తులు చేసినా, పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు కి నెల్లూరు జిల్లాకు ఉన్న అనుబంధ, సంబంధాల దృష్ట్యా, నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టడం సమంజసమనే భావించిన కార్యరూపం దాల్చలేదు. నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి, దశాబ్దాలుగా పెండింగులో ఉన్న అమరజీవి అభిమానుల కోరిక తీర్చిన మహనీయుడు స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి అని అన్నారు.
అమరజీవి అడుగుజాడల్లో, ఆయన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ, ప్రజలకు సహాయం చేస్తూ అండగా నిలిచిన వ్యక్తి మన నాయకుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి.
కూటమిపాలనలో విద్వేషాలు, కక్ష సాధింపులు తప్ప, మహనీయుల స్పూర్తితో పని చేయాలన్న ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యం అని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం అమరజీవి జయంతి సందర్భంగా ఆయన చూపిన బాటలో నడుస్తూ, ఆయన ఆశయ సాధన కోసం పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.