మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్ శ్రీ కన్వెన్షన్ హాల్ లో నూతన స్వీటోన్ స్వీట్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధిగా బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో సాంప్రదాయ రుచులతో కూడిన స్వీట్ షాప్ ను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని,కస్టమర్లకు మంచి నాణ్యమైన రుచికరమైన స్వీట్లను అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్వీట్ షాప్ యజమాని శంకర్ నారాయణ, లక్ష్మణ్ రావు,నాయకులు శంకరయ్య గౌడ్,సంతోష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మహేష్ గౌడ్,కిషోర్ కుమార్,అరుణ్ జోగి తదితరులు పాల్గొన్నారు.