మనన్యూస్,పీర్జాదిగూడ:మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా బొల్లోజు వేణు గోపాల్, శ్రీదేవి నేతృత్వంలో డ్రై ఫ్రూట్ పార్క్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ షాపు యజమానులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డ్రై ఫ్రూట్ పార్క్ షాప్ యాజమాన్యానికి అమర్ సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండి శ్రీనివాస్, జలంధర్ గౌడ్,కాలనీ వాసులు,మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.