మన న్యూస్,తిరుపతి,మార్చి 16:-తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా రూపేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నగరంలోని ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా భాషా, కోశాధికారిగా మల్లికార్జున్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు కన్వీనర్ గా బొడుగు మునిరాజా యాదవ్ వ్యవహరించారు. సుమారు 500 మంది తిరుపతిలోని ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన రూపేష్ మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చునని, ఏ ఒకరికి సమస్య వచ్చినా తనది గా భావించి సమస్య పరిష్కరించేందుకు దృష్టి సారిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రావెల్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు, కేశినేని ట్రావెల్స్ సుబ్రమణ్యం, ఎంఎంఆర్ ట్రావెల్స్ ముని చంద్ర, గరుడ ట్రావెల్స్ రాము, జగన్, ట్రావెల్స్ మురళి లతో పాటు పలువురు ట్రావెల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు.