నెల్లూరు,మన న్యూస్, మార్చి 16 :- శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు 6 వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ముందుగా ఏర్పాటు చేసిన స్వామి వారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని చంద్రశేఖర్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు.అనంతరం స్థానిక ప్రజలు, పార్టీ నేతలు కార్యకర్తలను చంద్రశేఖర్ రెడ్డి కలుసుకొని వారితో ఆప్యాయంగా మాట్లాడారు.