నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :- అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు సిటీ ఆత్మకూరు బస్టాండ్ సర్కిల్ నందు గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాలలు లేసి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు.తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అనుకున్న ఆశయం కోసం ప్రాణత్యాగానికి కూడా లెక్కచేయకుండా జాతిపిత మహాత్మా గాంధీ ని అనుసరిస్తూ సత్యం,అహింస మార్గాలుగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సైతం మార్గదర్శకంగా నిలిచిన మహనీయులు,ఆదర్శ మూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ జనసేన పార్టీ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని ముందుకు నడిపిస్తూ దేశం గర్వించదగ్గ 100 మంది నాయకుల్ని రాష్ట్రాన్నించి ఇస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కలిసికట్టుగా పనిచేస్తామని శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగ సారాన్ని ముందుకు నడిపిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,సిటీ నాయకులు గుర్రం కిషోర్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,యాసిన్ తదితర నాయకులు పాల్గొన్నారు.