గొల్లప్రోలు మార్చి 17 మన న్యూస్ :- గొల్లప్రోలు, శ్రీ సీతారామస్వామి వారి సన్నిధిలో కళ్యాణం చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందనీ, పిల్లాపాపలతో పదికాలాల పాటు సుఖంగా ఉంటారనేది భక్తుల నమ్మకం అందుకే అనాదిగా చుట్టు ప్రక్కల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి మరీ గొల్లప్రోలు విష్ణాలయంలో కొలువైన శ్రీ సీతారామస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. గత కొన్నేళ్ల క్రితం పాత కళ్యాణ మండపం శిథిలస్థితికి చేరుకున్నది. శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో వాయువ్య దిక్కు నందు సామాన్య ప్రజలు వివాహాములు జరుపుకొనుటకు శాశ్వత కళ్యాణ మండపం నిర్మాణం చేయుటకు "డోనర్ స్కీమ్" లో అనుమతి ఉత్తర్వులు ఇప్పించవలసినదిగా విజయవాడ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వారిని దాత, భక్తులు పేకేటి నాగేశ్వరరావు తరపున., భగవంతుని సేవగా భావించి.. ప్రోత్సాహకులు గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్ పర్సన్ శ్రీ గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి మంగతాయారు తో పలుమార్లు కలిసి అనుమతులు కోరారు.కాకినాడ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు మర్యాద పూర్వకంగా కలిసి దాత,భక్తులు పేకేటి నాగేశ్వరరావు అంగీకార హామీ పత్రాన్ని అందజేశారు. కళ్యాణ మండపం నిర్మాణంకు అయ్యే నిర్మాణ వ్యయం సుమారు 60 లక్షలు రూపాయలు మొత్తం భరించి సర్వాంగసుందరంగా శ్రీ స్వామి వారి సన్నిధిలో కళ్యాణ మండపం నిర్మించి భగవత్ కైంకర్యముగా సమర్పణ చేస్తాను అని దాత,భక్తులు పేకేటి నాగేశ్వరరావు పేర్కొన్నారు దీనికి స్పందించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు డోనర్ స్కీమ్ లో దాత పేకేటి నాగేశ్వరరావు శాశ్వత కళ్యాణ మండపం నిర్మాణం చేయుటకు అనుమతి ఉత్తర్వులు జారీచేశారు. పేకేటి నాగేశ్వరరావు రమాదేవి దంపతులు శ్రీ వైఖానస పండితులు, పట్టణ పెద్దల సమక్షంలో కళ్యాణ మండపంకు శంఖుస్థాపన చేశారు.నేడు కళ్యాణ మండపం పనులు పూర్తి చేసుకుని ది:14 న ప్రారంభోత్సవంకు సిద్దమైనది. వైఖానస ఆగమం ప్రకారం హోమాధిక్రతువులు నిర్వహించి, శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం నిర్వహిస్తారు.ఈ నూతన కళ్యాణ మండపంలో ఒకేసారి ఆరు జంటలు హాయిగా వివాహం చేసుకునేలా క్రింద భాగంలో ఏర్పాట్లు చేశారు. పైన మొదటి అంతస్తు పనులు కూడా ప్రారంభించారు.. ఇక పెళ్లిళ్ల సమయంలో నూతన వధూవరులతోనూ వారి బంధుమిత్రులతోనూ విష్ణాలయం కళకళలాడుతూ ఉంటుంది.శ్రీ స్వామి వారి సన్నిధిలోనే పెళ్లి చేసుకోవాలనుకుని మ్రొక్కుకున్న వాళ్ళకు దాత శ్రీ పేకేటి నాగేశ్వరరావు శ్రీమతి రమాదేవి దంపతులు నిర్మించిన కళ్యాణ మండపం అందుబాటులోకి తెచ్చారు. పైగా పెళ్ళి అంటే మాటలు కాదు. సంపన్నుల సంగతెలా ఉన్నా సామాన్యులకు అది తలకి మించిన భారంగా మారింది.అందుకే ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే శ్రీ సీతారామస్వామి వారి సన్నిధిలో తమ పిల్లల పెళ్ళి చేయాలకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. అన్ని ఆధునిక సౌకర్యాలతో కళ్యాణ మండపంను నిర్మించారు. పాపయ్య చావిడి శ్రీరామ కొవెలను 20 లక్షల రూపాయలతో పేకేటి నాగేశ్వరరావు జీర్ణోద్ధరణ చేసి ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు.