నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :- నెల్లూరు రాంజీ నగర్ ఆఫీస్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం వైసిపి నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను నాయకులతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.పొట్టి శ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.