నెల్లూరు రూరల్, మన న్యూస్,మార్చి 16 :- *60 రోజుల్లో పనులు పూర్తిచేసి, 609 మంది నాయకుల, కార్యకర్తల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ లో అభివృద్ధి పనులకు ఆదివారం ఉదయం స్థానిక ప్రజలతో కలసి శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1వ డివిజన్ లో అభివృద్ధి పనులకు 3 కోట్ల 50 లక్షల రూపాయలు నిధులు కేటాయించాము. 303 అభివృద్ధి పనులకు సహకరించిన మంత్రి పొంగూరు నారాయణ కి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి, జిల్లా కలెక్టర్ కి మరియు కమీషనర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 60 రోజుల్లో పనులు పూర్తిచేసి, 26 డివిజన్ లలో 303 చోట్ల ఒకే రోజు, ఒకే సమయానికి 609 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేస్తాం. పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జీ కుడుముల చిరంజీవి, కార్పొరేటర్ జానా నాగరాజు, పడిగినేటి రామ్మోహన్ యాదవ్, టీడీపీ నాయకులు జావీద్, జనార్దన్, శేషు, తంబి శ్రీనివాసులు, గంగి జయరామి రెడ్డి, రమేష్ రెడ్డి, రఘురామయ్య, బ్రహ్మయ్య, ధనుంజయ, కరిముల్లా, గౌస్, కంటేపల్లి శీనయ్య, జబ్బార్, సుబ్బరామయ్య, వెంకట సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, షరీఫ్, బాబు, షాహుల్, రాజు, రాజేష్, సర్ధార్, మధు, గౌరీ, శశి, జానా జనార్దన్, షేక్ మక్తుర్ తదితరులు పాల్గొన్నారు.