Mana News :- కోవూరు,మనన్యూస్,నవంబర్ 12) :- కోవూరు లోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ………..2024- 25 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లోఅభివృద్ధికి,సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించింది అని అన్నారు.గత వైసిపి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అధిక నిధులు కేటాయించింది అని అన్నారు.ఈ బడ్జెట్ లో నెల్లూరు జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు అని అన్నారు.అనముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ రంగానికి, ఈ బడ్జెట్ లో అధికంగా నిధులు కేటాయించారు అని అన్నారు.తెలుగుగంగ ప్రాజెక్టు కోసం మొత్తం రూ 880 కోట్లు కేటాయించగా,అందులో ఈ ప్రాజక్టు పరిధిలోని నెల్లూరు,తిరుపతి జిల్లాల కు రూ.422 కోట్లు కేటాయించారు అని అన్నారు.సోమశిల ప్రాజెక్టు కొరకు రూ.210 కోట్లు,పెన్నార్ డెల్టా కెనాల్ సిస్టమ్ అభివృద్ధి కొరకు రూ.33.42కోట్లు,సోమశిల,స్వర్ణముఖి లింక్ కెనాల్ కు 66 రూ. కోట్లు,కండలేరు లిఫ్ట్ కెనాల్ కొరకు 11కోట్లు,కనుపూరు కెనాల్ కొరకు రు.7 కోట్లు కేటాయించారు అని అన్నారు.అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రజాక్టుకు రూ.393 కోట్లు కేటాయించడం వలన మన జిల్లాలోని మెట్ట ప్రాంతం రైతులకు ప్రయోజనం కలుగుతుంది అని అన్నారు.మొత్తం మీద గతములో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో భారీగా నిధులు దక్కాయి అని అన్నారు.అదే విధంగా రామాయపట్నం,కృష్ణపట్నం పోర్టు ల అభివృద్ధికి,నెల్లూరు నగరంలోని భూగర్భ డ్రైనేజీ,త్రాగునీటి పథకాలు పూర్తి చేసేందుకు,అదేవిధంగా జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు అని అన్నారు.ఈ బడ్జెట్లో నెల్లూరు జిల్లా కు ప్రాధాన్యత ఇస్తూ వివిధ రంగాలకు నిధులు ఎక్కువ కేటాయించిన ముఖ్యమంత్రి కి మంత్రులకు జిల్లా తెలుగుదేశం పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలియచస్తున్నాము అని అన్నారు.