Mana News :- ఎందరినో బలి తీసుకుని, ఎన్నో కుటుంబాలను ఆగం చేసిన ఈ ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారిపై,వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లపై ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ గత కొంత కాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేసేలా చేశారు.అయితే, బెట్టింగ్ భూతంపై ఆయన యుద్ధం చేస్తుంటే మరోవైపు రోజూ కొన్ని లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రోలో ఒక్కసారిగా బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు వెలిసాయి.ఇలాంటి నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ప్రకటనలకు హైదరాబాద్ మెట్రో ఎలా అనుమతులు ఇచ్చింది? దయచేసి దీనిపై చర్యలు తీసుకోగలరు.. అని ఓ సామాన్యుడు సజ్జన్నార్ కు ట్యాగ్ చేశాడు.