మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంతో క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించవచ్చని సర్పంచ్ పీతల నూకరాజు,బిజెపి నాయకులు కొల్లా శ్రీనివాస్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని పంచాయితీలలో స్వచ్చ ఆంధ్ర,స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. శనివారం నాడు సిరిపురంలో అపరిశుభ్రంగా వున్న ప్రాంతాలలో స్థానిక సచివాలయం సిబ్బంది మరియు గ్రామ సర్పంచ్ పీతల నూకరాజు,గ్రామ కార్యదర్శి సత్యనారాయణ ఆద్వర్యంలో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగిందని అన్నారు.చీపుర్లతో వీధులను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు కొల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని,కాగితపు టీ గ్లాసులు,ప్లాస్టిక్ కవర్లు వాడకం ద్వారా క్యాన్సర్ వస్తుందని తెలిపారు.రాబోయే రోజుల్లో మండల కేంద్రంలో క్యాన్సర్ నివారణ సెంటర్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని శ్రీనివాస్ తెలిపారు.అనంతరం గ్రామంలోప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు.దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని పంచాయితీ కార్యదర్శి నోటీసు ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో కూటమి నాయకులు చిలకమర్తి ఆదినారాయణ,బచ్చల నాగ శివ,కాకర జార్జి,వనుం శ్రీను, అగ్రికల్చల్ అసిస్టెంట్ మణికంఠ,హెల్త్ సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్ వాడి కార్యకర్తలు ,గ్రామస్తులు పాల్గొన్నారు.