మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం :ఆంధ్రప్రదేశ్ పశుగాణభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన యర్రవరంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు కృత్రిమ గర్భధారణ ద్వారా సం లోపు పుట్టినసుమారు 50పెయ్య దూడలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి ఇక్కడికి వచ్చిన లేగ దూడలకు ఏలిక పాముల నివారణకు మందు, బృచెల్ల వాక్సినేషన్ ను పశువైద్య శాఖ అధికారులు చేతుల మీదగా వేశారు.ఈ ప్రదర్శనలో ప్రధమ,ద్వితీయ,తృతీయ విభాగాలను ఎంపిక చేసి బహుమతులు అయా రైతులకు అందజేశారు.ప్రదర్శనకు వచ్చిన అన్ని దూడలకు కాల్షియమ్ మరియు లివర్ టానిక్స్, మినరల్ బ్లాక్స్ అందజేసారు.ఈ సందర్భంగా ఎంపీపీ బుజ్జిఏడి బాలచంద్ర యోగేశ్వర్ మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు తమ పశువుల సంబంధించిన లేగదూడలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.సీజనల్ గా వచ్చే వ్యాధులను గుర్తించి వెంటనే సంబంధిత చికిత్స పశువులకు అందించాలని తెలిపారు.కృత్రిమ గర్భధారం ద్వారా మేలు రకపు పశువులు జన్మస్థాయిని రైతులు గ్రహించాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలోఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, స్థానిక సర్పంచ్ భీశెట్టి అప్పలరాజు, గ్రామ టీడీపి నాయకులు బసా ప్రసాద్,మైరాల కనకారావు,తోటవెంకటేశ్వరరావు,ప్రత్తిపాడు సహాయ సంచాలకులు డాక్టర్ చిక్కం బాల చంద్ర యోగీశ్వర్,సహాయకులు యస్ వరలక్ష్మి,ఈ.సతీష్ కుమార్, పి ఎన్ యస్ మంజూష,టీ వి కళ్యాణి మరియు ఇతర మండల పశు సంవర్ధక శాఖ పారా సిబ్బంది,పశు వైద్య సహాయకులు పాల్గొన్నారు.