మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:నగర పంచాయతీ లో డబ్బులు ఇస్తే ఏ పనీ అయినా సరే పని పూర్తయిపోతుంది అనే విధానాన్ని మున్సిపల్ ఆఫీసులోని విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగి పెంకె శ్రీనివాసరావు ఎన్నో సంవత్సరాలుగా దందా కొనసాగించి,ఎన్నో లక్షల రూపాయలు వెనకేసుకున్నారని,ఏ విధమైన ఆధారాలు లేనప్పటికీ డబ్బులు ఇస్తే ఇంటి పన్ను నుండి ఖాళీ స్థలం పని వరకు ఏదైనా సాధ్యమే అంటూ లక్షల రూపాయలు ప్రజల నుండి దోచుకున్నారని కౌన్సిలర్లు లిఖితపూర్వకంగా నగర పంచాయతీ కమిషనర్ కి ఈనెల 11వ తేదీ నా ఫిర్యాదులు సమర్పించినప్పటికీ,నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం లో ఈ విషయం లేవనెత్తుతారని తెలిసి ఆయన గైర్హాజరయ్యారు.అయితే ఈ విషయంపై కమిషనర్ ని నిలదీయగా,ఆయన సమాధానం తూతూ మంత్రంగా ఉంది. అయితే వైసిపి కౌన్సిలర్లు విలేకరుల తో మాట్లాడుతూ పెంకే శ్రీనివాసరావు అవినీతిపై ఆర్డిఓ మరియు కలెక్టర్ వరకు వెళతామని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే కోర్టును సైతం ఆశ్రయిస్తామని,ఈ అవినీతిపై నిగ్గు తేల్చే వరకు వదలబోమని అన్నారు.ఈ కార్యక్రమంలో మూడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు,శిడగం త్రివేణి వెంకటేశ్వరరావు,సుంకర హైమావతి రాంబాబు, సామంతుల సూర్య కుమార్ తదితర కౌన్సిలర్లు పాల్గొన్నారు.