మనన్యూస్,నెల్లూరు: పవిత్ర రంజాన్ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారిని వైసీపీ చెందిన పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా సత్కరించి ముందస్తు రంజాన్ పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నెల్లూరులోని ఆదాల క్యాంప్ కార్యాలయంలో మాజీ ఏఎంసి చైర్మన్ ఏసునాయుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ డివిజన్ చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ కరిముల్లా తదితరుల ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ నాయకులు మాజీ ఎంపీ ఆదాలను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిగారిని సత్కరించి ముందస్తు రంజాన్ పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమ్మద్, అఫ్జల్, బషీరా, అహ్మద్ భాషా, సుభాని, జిలాన్, మున్నా, రెహమాన్, హఫీజ్, షేక్ అల్లాబక్షు, షేక్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.