నెల్లూరు, మన న్యూస్, మార్చి 15 :- నెల్లూరు వై సి పి నగర కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్చార్జి & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు సందడిగా సాగాయి.ఈ సందర్బంగా YSRTA నేతలతో కలిసి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…….ఉపాధ్యాయల సమస్యల పరిష్కార దిశగా ఏపీ వైఎస్ఆర్టిఏ ఉద్యమించాలని చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.భవిష్యత్తులో ఏపీ వైఎస్ఆర్టిఏ ఉపాధ్యాయులకు, విద్యారంగానికి సేవలందించే ఉత్తమ అసోసియేషన్ గా కీర్తి గడించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టిఏ జిల్లా అధ్యక్షులు K. శివశంకర్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ జాన్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు యం సుబ్బారెడ్డి , వాసు , రాష్ట్ర కార్యదర్శి బి సురేంద్ర, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు N. శ్రీలత , జిల్లా కార్యదర్శులు వేణుగోపాల్ రెడ్డి , B వెంకటేశ్వర్లు, సురేష్ పాల్గొన్నారు.