మనన్యూస్,గొల్లప్రోలు:పిఠాపురంనియోజవర్గం గొల్లప్రోలుమండలం దుర్గాడ గ్రామం నందు ఇబిసి కాలనీలో శ్రీశ్రీశ్రీ ఐశ్వర్య సిద్ధి గణపతి స్వామి వారి ఆలయం ప్రథమవార్షికోత్సవానికి జిల్లా జనసేన కార్యదర్శి శ్రీ జ్యోతుల శ్రీనివాసు ముఖ్యాతిధిగా ఐశ్వర్య సిద్ధి గణపతి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ప్రథమవార్షికోత్సవంలో పాల్గొన్నారు.ముందుగా ఆలయమర్యాదలతో ఆలయకమిటి వారు పూర్ణకుంభంతో జ్యోతుల శ్రీనివాసును ఆహ్వానించారు, అనంతరం జ్యోతుల శ్రీనివాసు సిద్ది వినాయకుని ఆలయకమిటి పెద్దలతో కలిసి దర్శనం చేసుకొన్నారు.ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ఐశ్వర్య సిద్ది గణపతి ఆలయం దుర్గాడ గ్రామంలో ప్రాచుర్యం చెందినదని ఈ ఆలయం కమిటీ వారు తగువిధంగా ల ఆలయాన్ని బాగా అభివృద్ధి పరుస్తున్నారని అందు ఆలయకమిటి వారికి ప్రత్యేకం అభినందనలు తెలియజేయుచున్నాని,అదే విధంగా ఇబిసి కాలనీలో దైవ,సామాజిక కార్యక్రమాలకు తనవంతు సహకారం కావలివస్తే సదరు విషయంను నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే నేను తగువిధంగా సహకరిస్తానని ఆలయకమిటి వారికి ఇబిసి కాలనీ వాసులకు జ్యోతుల శ్రీనివాసు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ఐశ్వర్య వరసిద్ది వినాయకాలయకమిటీ వారు కాపారపు వెంకటరమణ,కొసిరెడ్డి ఆదినారాయణ,ఉంగరాల బాబురావు,కుర్రు శ్రీను, గారపాటి మాణిక్యం,ఉంగరాల నాగేశ్వరరావు,కుర్రు సత్యనారాయణ,సాన పద్ధరాజు,ఉల్లిశెట్టి లచ్చయ్య,కాపారపు రాఘవ, కడప రాఘవ,గ్రామ జనసేన నాయకులు కొమ్మూరి కృష్ణ,కందా శ్రీను,మొగిలి శ్రీను, మేడిబోయిన సత్యనారాయణ,పోలం త్రిమూర్తులు,చేశెట్టి భద్రం, జ్యోతుల వాసు,కాపార వెంకటరమణ{పూసలు},మంతెన గణేష్,కొప్పుల చక్రదర్,జ్యోతుల గోపి,కొలా నాని తదితరులు పాల్గొన్నారు.