మనన్యూస్,నాగోల్:ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్లోని ఆనంద్ నగర్ చౌరస్తాలో డాక్టర్ చైతన్య నేతృత్వంలో చైతన్య క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ముద్దగొని రామ్మోహన్ గౌడ్ హాజరయ్యారు.హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ హాస్పిటల్ లో అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు.స్థానిక ప్రజలందరూ తమ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో చెరుకు జంగయ్య గౌడ్,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.