
మన న్యూస్ (విజయనగరం) ; తొలి తెలుగు రామాయణ కవయిత్రి శ్రీశ్రీశ్రీ కుమ్మర మొల్లమాంబ జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా కలెక్టర్ వారి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. విజయనగరం జిల్లా కలెక్టర్ శ్రీ అంబేద్కర్ గారు మరియు విజయనగరం మార్క్ఫెడ్ చైర్మన్ శ్రీ కర్రోతు బంగార్రాజు గారు అతిథులుగా పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆమె రచనలు నేటి తరానికే కాకుండా కాబోయే తరానికి కూడా ఆదర్శం అని పేర్కొన్నారు.విజయనగరం జిల్లా శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ రాలి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మొల్లమాంబ చరిత్రను వివరిస్తూ ఆమె మన కులంలో పుట్టడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని కొనియాడారు. విజయనగరం జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు శ్రీ కోసూరు రమణ గారు మాట్లాడుతూ రామాయణ రచనలే కాకుండా 16వ శతాబ్దంలోనే అనేక సంఘసంస్కరణలు చేపట్టారని తెలిపారు .అమలాపురం నారాయణ రావు గారు మాట్లాడుతూ ఆమె రచనల్లో కొన్ని కవితలను శ్రోతలకు చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో కుల పెద్దలు ఉబ్బిశెట్టి అప్పలస్వామి గారు, అంబటి శ్రీను గారు, వీర్రాజు గారు, శ్రీకాకుళపు వెంకట రమణమూర్తి గారు, మరియు ఈ కార్యక్రమంలోఅనేకమంది అధికారులు, ఉద్యోగులు, కుమ్మర కుల పెద్దలు , వ్యాపారులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.మొల్లమాంబ జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా జరుపుకోవడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.