మన న్యూస్ (గుర్ల); తొలి తెలుగు ఆడపడుచు , రామాయణ కవయిత్రి , శ్రీ శ్రీ శ్రీ కుమ్మర మొల్లమాంబ 585 వ జయంతి వేడుకలు గుర్ల మండలము,గుర్ల గ్రామంలో , విజయనగరం జిల్లా శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం (V-SEWA)అధ్యక్షులు శ్రీ రాలి శ్రీనివాసరావు గారి నివాసంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మన కుమ్మర కులంలో పుట్టిన వ్యక్తి అందులోనూ ఒక మహిళ రామాయణ కావ్యాన్ని రచించడం ఒక అద్భుతమని, అది మనకెంతో గర్వకారణం అని కొనియాడారు .వాల్మీకి రాసిన రామాయణం కంటె ఈమె రాసిన రామాయణం తెలుగు ప్రజల మదిలో నిలిచిపోతుందని తెలిపారు.