మన న్యూస్ తవణంపల్లె మార్చ్ 12:- ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని మండలంలోని వెంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన విలేఖరి ప్రతాప్ రెడ్డి రైటింగ్ ఫ్యాడ్స్ పెన్లను పంపిణీ చేయడం జరిగింది. పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా సరస్వతి పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. రాబోవు 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుతూ పాఠశాల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో సరస్వతి దేవి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామనికి సంబందించిన విలేకరి ప్రతాప్ రెడ్డి విద్యార్థులు అందరూ పరీక్షలు బాగా రాసి అందరూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ప్రసాద్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు శాంతి, పి ఆర్ టి యు జిల్లా ఉప కార్యదర్శి ఏ విజయ్ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు మోహన్ కృష్ణ, హేమచంద్రరెడ్డి, రామచంద్ర, మురళి కృష్ణ, ఇనయ్ తులై బాష, ఉపాధ్యాయురాలు భార్గవి, నాగజ్యోతి,రాజేశ్వరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.