మనన్యూస్,బి.యన్ రెడ్డి నగర్:డివిజన్ పరిధిలోని బి.యన్.రెడ్డి నగర్ ఫేస్ 1 పార్కులో 21,00,000 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్స్ ఓపెన్ జిమ్ ను బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బి.యన్.రెడ్డి నగర్ ఫేస్ 1 పార్కులో 21,00,000 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్స్ ఓపెన్ జిమ్ పరికరాలను కాలనీవాసులతో కలిసి పర్యవేక్షించడం జరిగింది త్వరలోనే కాలనీ అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపడుతామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు పురుషోత్తమ రెడ్డి,దేవి పోచమ్మ ఆలయ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, ధనరాజ్, లక్ష్మారెడ్డి, బిక్షపతి, నవీన్, రాములు, రవి, పెంటారెడ్డి, జలంధర్ రెడ్డి, కాశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.