తవణంపల్లి మన న్యూస్ మార్చ్ 12 :-మండలంలోని వెంగంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2024 25 సంవత్సరానికి గాను పదవ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు స్కూలు ఉపాధ్యాయులు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట సరస్వతి పూజ నిర్వహించి విద్యార్థులను ఉపాధ్యాయులు ఆశీర్వాదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ప్రసాద్ రెడ్డి ప్రధానోపాధ్యాయురాలు శాంతి, ఉపాధ్యాయ యూనియన్ పిఆర్టియు జిల్లా ఉప కార్యదర్శి మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఏ విజయ్ భాస్కర్ రెడ్డి, మరియు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గ స్టాఫ్ ఇంచార్జి ఎన్ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.