మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల నియోజకవర్గం సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ పంపిణీ ధరూర్ మండల కేంద్రము సబ్ స్టేషన్ దగ్గర రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు.గద్వాల నియోజకవర్గం సంబంధించిన 200 ట్రాన్స్ఫార్మర్స్, ప్రొసీడింగ్ పత్రాలను రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించడం జరిగినది. ఎమ్మెల్యే అధికారులు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.గద్వాల నియోజకవర్గం లో 7 గ్రామాలలో నూతన సబ్ స్టేషన్లు మంజూరు కావడం జరిగింది అని తెలిపారు.ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో గద్వాల ప్రాంతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు రైతులు కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారు కరెంటు లేక సరైన పంటలు లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునేవారు. గతంలో పాలించిన నాయకులు గ్రామాలలో సరిగ్గా విద్యుత్ లేక ఎంతోమంది ఇబ్బందులను పడేవారు రైతులైతే పంట పొలాల పండగ కాక సరైన నీళ్లు వసతి లేక ఎన్నో ఇబ్బందులు పడి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవాడు అని పేర్కొన్నారు.
నేను ఎమ్మెల్యేగా గెలిచి నప్పటి నుండి ఈ ప్రాంతంలోని రైతుల యొక్క కష్టాలను తీర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యంగా తాగునీరు ,విద్యుత్తు వంటి సమస్యలతో ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో 200 కోట్లతో రూపాయలు దాదాపుగా 500 పైగా ట్రాన్స్ఫారం లో,పంపిణీ చేయడం జరిగింది.సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది.అదేవిధంగా ప్రతి మండలంలో ట్రాన్స్ఫారంలు పంపిణీ చేయడం జరిగింది. రైతులకు నీటి సమస్యను విద్యుత్ సమస్యను లేకుండా కొంతమేరకు పరిష్కరించడం జరిగిందని తెలిపారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం విద్యుత్ శాఖ మంత్రివర్యులు నేతృత్వంలో రైతులకు 24 గంటల కరెంటు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు నీటిని అందజేయడం జరుగుతుంది.ఏప్రిల్ లో పదవ తేదీ వరకు ప్రతి ఒక్క రైతుకు చివరి ఆయకట్టు వరకు విడతల వారిగా నీటిని అందించే విధంగా నా వంతు కృషి చేస్తానని రైతులు ఎవరు కూడా అధైర్య పడకండి వద్దని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గం ప్రజలకు కరెంట్ అందజేస్తూ త్వరలోనే కొన్ని గ్రామాలకు సబ్ స్టేషన్లు మంజూరు కావడం జరిగింది. త్వరలోనే వాటిని కూడా సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకొని గ్రామాలలో లో వోల్టేజ్ సమస్యలను లేకుండా చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ప్రస్తుతం సమాజంలో కరెంటు లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సమన్వయంతో విద్యుత్తును ఉపయోగించుకోవాలని కోరారు విద్యుత్ అధికారులకు శ్రమకు విలువ కట్టలేదని ఏ ఒక్క చిన్నగా విలువైన వ్యాపార సంస్థ అయిన పెద్ద ఇండస్ట్రీ అయిన ప్రతిదానికి కరెంటు ఉండాల్సిందే కాబట్టి కరెంటు అధికారులు అనునిత్యం పనిచేయడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో కరెంటు పోవడంతో ప్రజలు అధికారులను ప్రజాప్రతిని తప్పుగా అర్థం చేసుకుంటారు. వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి సహకరించాలని కోరారు.భవిష్యత్తులో గద్వాల నియోజకవర్గంలో ఏ ఈ గ్రామంలో కూడా లో వోల్టేజ్ కరెంటు లేకుండా చూసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరికొన్ని గ్రామాలకు సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫారం లో తీసుకువచ్చే విధంగా నా సాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు.
గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు మీ అందరి ఆశీస్సులతో మరొక్కసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందు కు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ జెడ్పిటిసిలు పద్మా వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, మాజీ సర్పంచ్లు,నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, ఉరుకుందు, మహబూబ్, నవీన్ రెడ్డి, శ్రీరాములు, కురుమన్న, వీరన్న గౌడ్, నాగన్న, గోపి, మొయినుద్దీన్, యువ నాయకులు పురుషోత్తం రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.