మనన్యూస్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలోని 2 మరియు 12వ డివిజన్ లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి బుధవారం శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీకూడా నెల్లూరు నగర కార్పోరేషన్ పరిధిలో 26 డివిజన్లకు సంబంధించినవి, వీటి అంచనా విలువ షుమారు 40 కోట్ల రూపాయలు, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో మరియు 18 గ్రామాలతో కలిపి 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాము అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలపడమే లక్ష్యంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమంతో ప్రతి డివిజన్ లో అభివృద్ధి పనులు చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువనాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి, మునిసిపల్ శాఖ మంత్రివర్యలు పొంగూరు నారాయణ కి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మరియు అధికార యంత్రాంగానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. అక్షరాల 60 రోజుల్లో శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులు అన్నీ పూర్తిచేసి, మే 20వ తేదీన ప్రజలకు అంకితం చేస్తాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీలు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.