మనన్యూస్,నెల్లూరు:యువత పోరు కు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత మరియు పార్టీ కార్యకర్తలు.సుమారు 2000 మందికి పైగా విద్యార్థులు..యువత మరియు కార్యకర్తలతో నెల్లూరు సిటీ నియోజకవర్గం దద్దరిల్లింది.
నెల్లూరు సిటీ లో జరుగుతున్న ప్రతి కార్యక్రమం అద్భుతం గా విజయవంతం అవుతుంది
ప్రత్యేకంగా నెల్లూరు సిటీ నుంచి భారీ సంఖ్యలో యువత విద్యార్థులు కార్యకర్తలు హాజరు కావడం విశేషం.చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు వైఎస్ఆర్సిపి కార్యక్రమానికి హాజరు కావడం అద్భుతం.కూటమి ప్రభుత్వం ఇలాంటి పాలననే కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అనే చెప్పడానికి ఈ యువత పోరు కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ.
యువత, విద్యార్థుల నినాదాలతో దద్దరిల్లిన నెల్లూరు నగరం. వేలాదిగా తరలి వచ్చిన విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్ర ప్రజలు.ముందుగా నెల్లూరు విఆర్సి సెంటర్ వద్ద మహనీయుడు డా౹౹బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, అంబేద్కర్ కూడలి నుండి కలెక్టరేట్ వరకు పెద్దఎత్తున తరలివచ్చిన వేలాదిమందితో భారీ ర్యాలీ నిర్వహించి, జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ.ర్యాలీలో ఉత్సాహంగా, కేరింతలతో కదంతొక్కిన జనం.చరిత్రలో ఎన్నడూ, కనివిని ఎరుగని రీతిలో హాజరైన అశేష జనవాహిని.జగనన్న పిలుపుమేరకు, నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన "యువత పోరు" నిరసన కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చి, భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని, విజయవంతం చేసిన నియోజకవర్గాల ఇన్చార్జీలు శాసనమండలి సభ్యులు, యువత, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి.